Saturday 14 June 2014

సినీ నటి తెలంగాణ శకుంతల కన్నుమూత. శకుంతల హఠాన్మరణం బాధాకరం

సినీ నటి తెలంగాణ శకుంతల(65) శుక్రవారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంపల్లిలోని తన స్వగహంలో శకుంతల గుండెపోటుతో మృతి చెందారు. తెలుగులో వచ్చిన ‘మాభూమి' చిత్రం ద్వారా తెరంగ్రేటం చేసిన ఆమె తెలంగాణ యాసతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.


తెలుగు తెరపై టిపికల్ తెలంగాణ స్లాంగుతో అదరగొట్టిన నటి తెలంగాణశకుంతల విలనిజం,కామెడీ, సెంటిమెంట్...ఇలా ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించగల సత్తా ఉన్న నటి ఆమె. అటువంటి మహానటి నేడు మన మధ్య లేక పోవడం బాధాకరం. పలు తెలుగు చిత్రాల్లో  నటించిన తెలంగాణ శంకుతల మేంరూపొందిన అన్ని చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషించింది. ‘పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రంలో కూడా తన నటనతో అదరగొట్టింది. స్వతహాగా స్టేజ్ ఆర్టిస్ట్ అయిన తెలంగాణ శకుంతల స్వయం శక్తితో నటిగా వెలుగొందిన వైనం ప్రశంసనీయం. తెలుగు చిత్రసీమలో తెలంగాణ శకుంతల స్థానం భర్తీ చేయడం అనితరసాధ్యం.

ఫోర్బ్స్ జాబితా: హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ పవన్ కళ్యాణ్

ముఖ ఫోర్బ్స్ ఇండియా మేగజైన్....తాజాగా ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సినీ తారల జాబితా విడుదల చేసింది. టాప్ 100 లిస్టులో బాలీవుడ్ స్టార్లతో పాటు పలువురు టాలీవుడ్, తారలు కోలీవుడ్ తారలు చోటు దక్కించుకున్నారు. బాలీవుడ్ నుండి అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల లిస్టులో టాప్ ప్లేసులో షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ ఉండగా....టాలీవుడ్లో అత్యదిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా పవన్ కళ్యాణ్‌ పేరు టాప్ పొజిషన్లో ఉంది. ఇక తమిళంలో రజనీకాంత్ పేరు టాప్‌లో ఉంది.

 


పవన్ కళ్యాణ్ టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు రూ. 23 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రకటించింది.



మహేష్ బాబు ఇక టాలీవుడ్ నుండి మహేష్ బాబు సెకండ్ ప్లేసులో ఉన్నారు. మహేష్ బాబు ఒక్కో సినిమాకు రూ. 21 కోట్లు తీసుకుంటున్నాడట.



రామ్ చరణ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా తెరంగ్రేటం చేసి అనతి కాలంలో తెలుగు స్టార్ హీరోగా ఎదిగిన రామ్ చరణ్ తేజ్ రూ. 18 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట.

అల్లు అర్జున్ ఇక స్టైలిష్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఒక్కో సినిమాకు అన్ని కలిపి రూ. 17 కోట్లు తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది.

జూ ఎన్టీఆర్ ఇక టాప్ 5లో చోటు దక్కించుకున్న జూ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 15 కోట్లు తీసుకుంటున్నాడట.

రజనీకాంత్ ఇక తమిళ హీరో రజనీకాంత్ అత్యధికంగా రూ. 32 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఫోర్బ్స్ జాబితాలో ఉంది.

విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ రూ. 22 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.

సూర్య

తమిళంతో పాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న సూర్య ఒక్కో సినిమాకు రూ. 20 కోట్లు తీసుకుంటున్నాడు.

అజిత్

తమిళ హీరో అజిత్ ఒక్కో సినిమాకు రూ. 18 కోట్లు తీసుకుంటున్నాడట.

విక్రమ్

మరో తమిళ హీరో విక్రమ్ ఒక్కో సినిమాకు రూ. 17 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.

Thursday 12 June 2014

పవనిజమ్ ఆంధ్రప్రదేశ్ హద్దులను దాటి జాతీయస్థాయిలో సంచలనంగా మారబోతోంది

పవన్ పై ఆశక్తీకర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ హీరో ! వివేక్ ఓబ్రాయ్ మాటలను బట్టి పవనిజమ్ ఆంధ్రప్రదేశ్ హద్దులను దాటి జాతీయస్థాయిలో సంచలనంగా మారబోతోంది అనే సంకేతాలు వివేక్ ఓబ్రాయ్ మాటలు ద్వారా వినిపిస్తున్నాయి.
గత ఆదివారం సీమాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఉత్సవానికి ప్రత్యేక అతిధిగా వచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచాడు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబ్రాయ్. ప్రమాణస్వీకార ఉత్సవం జరుగుతున్నంతసేపు పవన్ కళ్యాణ్ పక్కనే కూర్చుని సందడి చేసాడు వివేక్ ఓబ్రాయ్.


చాలాకాలం తరువాత భాగ్యనగరం వచ్చిన వివేక్ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై ఆశక్తికర వ్యాఖ్యలు చేసాడు వివేక్. పవన్ తనకు అన్న లాంటి వాడని కామెంట్ చేయడమే కాకుండా పవన్ తనకు ఒక మార్గదర్శి అంటూ పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు వివేక్. తాను ఆరు సంవత్సరాల క్రితం పవన్ ను కలిసిన నాటి నుంచి పవన్ కు తాను వీరాభిమానిగా మారిపోయానని చెప్పడమే కాకుండా పవన్ సినిమాలను తాను వరుస పెట్టి చూస్తానని చెప్పుకొచ్చాడు ఈ విలక్షణ బాలీవుడ్ నటుడు. ఇదే నేపధ్యంలో మరొక ఆశక్తికర విషయాన్ని కూడ బయట పెట్టాడు వివేక్. అతిత్వరలో తాను నిర్వహించబోతున్న ఒక భారీ రక్తదాన శిబిరానికి పవన్ కళ్యాణ్ సహాయం తీసుకోబోతున్నానని ఒకేఒక్క రోజులో దాదాపు లక్ష లీటర్ల రక్తాన్ని సేకరించే ఈ బృహత్తర కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ను ప్రచార సారధిగా వినియోగించుకోవాలని ఆలోచిస్తున్నానని చెప్పాడు వివేక్. అంతేకాకుండా ‘పవన్ అన్నతో అనేక సామాజిక కార్యక్రమాలు ముంబాయిలో చేస్తాను’ అన్న వివేక్ ఓబ్రాయ్ మాటలను బట్టి పవనిజమ్ ఆంధ్రప్రదేశ్ హద్దులను దాటి జాతీయస్థాయిలో సంచలనంగా మారబోతోంది అనే సంకేతాలు వివేక్ ఓబ్రాయ్ మాటలు ద్వారా వినిపిస్తున్నాయి.

Wednesday 11 June 2014

హిమాచల్ భాదితులకు పవన్ చేయూత



పవన్ కళ్యాణ్ అంటే పవర్ స్టార్ మాత్రమే కాదు మనసున్న మనషి అని కూడా అనిపించుకోవడంలో ముందుంటాడు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. విహారయాత్రకు పోయి మృత్యు ఒడికి చేరిన 24 మంది తెలుగు విద్యార్ధులకు సహాయం చేయడానికి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చాడు. ఈ వార్త విన్న పవన్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. సోమవారం తను వెంకటేష్ తో కలిసి నటిస్తున్న ‘గోపాలా గోపాలా’ సినిమా ముహూర్తం జరిగిన వెంటనే అయన హిమాచల్ ప్రదేశ్ కి బయలుదేరి వెళ్ళారు. అంతేకాకుండా చనిపోయిన వారీ కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల విరాళాలు కూడా ఇస్తున్నారు.

నటనతో ప్రజలను అలరించడమే కాదు, మంచి పనులు చేసి అవసరంలో ఉన్న వారీని అధికోవడంలో పవన్ ఎప్పుడు ముందు ఉంటాడు. ఇంతకు ముందు కూడా ఉత్తరాఖండ్ వరద భాధితులకు కూడా 24 లక్ష విరాళాలను పవన్ అందించాడు. అంతకు ముందు ఆసిడ్ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రణీతను కూడా పవన్ ఆదుకున్నాడు. ఆమెలో మనోధైర్యాన్ని పెంచాడు. ఇదే మరి పవనిసం అంటే.

Tuesday 10 June 2014

పవన్ పై 'బాబు' చెయ్యి?



అక్కడ అంత పచ్చ చొక్కలు, పచ్చ జెండాలు, అంత పసుపుమయంతో నిండిపోయింది. సైకిల్ కార్యకర్తలు ఆనందంగా, ఉత్సహాంగా కనిపిస్తున్నారు. కానీ ఇంతలో ..తెల్ల చొక్క, బ్లూ జీన్స్ ధరించిన వ్యక్తి కారులోంచి దిగటంతో.. అందరి చూపులు, కెమెరా కళ్లు అతనిపై పడ్డాయి. దీంతో చంద్రబాబు ఒక్కసారి అల్టర్ అయ్యి , పరుగు..పరుగున ఎదురెళ్లి ఆ వ్యక్తిని తన సంపూర్ణ కౌగిలిలో బంధించాడు. దీంతో అక్కడే ఉన్న పచ్చచొక్క తమ్ముళ్లు షాక్ తిన్నారు. సహజంగా చంద్రబాబు ఇప్పటి వరకు.. ఆయన రాజకీయ చరిత్రలోకి తొంగి చూస్తే, వస్తున్న వ్యక్తికి ఎదురువెళ్లి కౌగిలించుకున్న దాకలు లేవు. ఎవరైన దగ్గరికి వచ్చిన తరువాతే
చంద్రబాబు చెయ్యి కలుపుతారు. అలాంటి చంద్రబాబు నిన్నసభలో జరిగిన విషయాన్నిచూసి, అక్కడున్న తమ్ముళ్లు ఆలోచనల్లో పడినట్లు తెలుస్తోంది.


అసలు ఇంతకీ ఆ వ్యక్తి ఎవరా అని అనుకుంటున్నారా? అధికారం కోసం అష్టకష్టాలు పడుతూ.. పదేళ్లుగా ఎదురుచూస్తున్న
చంద్రబాబుకు అధికారం రావటానికి ..తన వంతుగా సాయం చేసిన ..‘‘జనసేన అధినేత కొణిదేల పవన్ కళ్యాణ్ ’’.. చంద్రబాబు గతంలో అనేక పార్టీలో నాయకులతో మద్దతు తీసుకున్నారు. కానీ వారితో ఎంతవరకు అంటే, అంత వరకే రాజకీయ జరిపాడు. కానీ పవన్ కళ్యాణ్ కు మాత్రం అలా కాదు. సభలోకి వస్తున్న పవన్ కళ్యాన్ కు చంద్రబాబు ఎదురెళ్లి. అప్యాంగా కౌగిలించుకోని, పవన్ పై చెయ్యి వేసి, తనలో ఉన్న ఆత్మీయ, అనురాగంను..పవన్ కు పంచిపెట్టారు చంద్రబాబు. అప్పుడు కేంద్రం హోంమంత్రి రాజ్ నరసింగ్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సుజనా చౌదరి అక్కడే ఉన్నారు. కానీ బాబు మాత్రం పవన్ పై చూపించి
అభిమానం అంత ఇంత కాదు. ఈ సన్నివేశం చూసిన కెమెరా కళ్లు మెరుపు ల స్టౌండ్ తో తమ ఆనందాన్ని వ్యక్తం చేశాయి. దీంతో పార్టీలోని సీనియర్ నాయకులు సైతం.. ఆశ్చర్యపోయినట్లు సమాచారం. 



అంతేకాకుండా.. సభలోని వేదిక పై కూర్చున్న అతిరథ మహా రధుల మద్య పవన్ కు స్థానం కల్పించారు చంద్రబాబు. అంతేకాకుండా బాబు తన ప్రసంగంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్
నిస్వార్థంగా చేసిన సహాయాన్ని సభాముఖంగా కొనియాడుతూ అందుకు కృతజ్ఞతలు చెప్పటంతో.. సభలో కొద్ది సేపు.. చప్పట్ల స్టౌండ్ తో పేలిపోయింది. దీంతో పాటు ..కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, సభకు వచ్చిన ముఖ్య అథితులను పరిచయం చేస్తూ, యువ నటుడు, యంగ్ డైనమిక్, పవర్ పుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పటంతో.. సభలో ఒక్కసారిగా భారీ ఎత్తున అలజడి లేసింది. పవన్ పేరు వినబడిన వెంటనే సభలో చప్పట్లు, విజిల్స్ ల సందడితో ఆ ప్రాంతమంత మారుమ్రోగిపోయింది. దీంతో వెంకయ్య నాయుడు ..కొద్ది సేపు తన ప్రసంగాన్ని ఆపి, కార్యకర్తల ఆనందాన్ని తిలకించారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్.... కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. వేదిక పై ముందుకు నడిచి రావటంతో ..సభలోని సందడి మరీ ఎక్కువైంది. ఈ సన్నివేశాన్ని కల్లారా చూసిన చంద్రబాబు, కేంద్రమంత్రులు ఆనందంగా ఎంజాయ్ చేసినట్లు తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. మారిన చంద్రబాబును ..అందరు చూసి ఆనందం వ్యక్తం చేయటం జరిగింది. 

Monday 9 June 2014

పవన్ ను మంత్రివర్గంలోకి తీసుకొనే ఆలోచనలో మోడీ?



సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను తన మంత్రి వర్గం లోకి తీసుకోవాలనే ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారు. ఇదే వరకే పవన్ కళ్యాణ్ కు మోడీ మంత్రి పదవిని ఆఫర్ ఇవ్వగా దాన్ని పవన్ సున్నితంగా తిరస్కరించారు.తనకు అటువంటి పదవులు అవసరం లేదని కూడా పవన్ తెలిపారు.అయితే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ద్వారా తాను ఇచ్చిన ఆఫర్ ను పవన్ మరోసారి పరిశీలించ వలసిందిగా మోడీ కోరినట్లు సమాచారం.

పవన్ కు రాజ్యసభ సీటు ను కేటాయించి, తన రెండో దశ మంత్రివర్గ విస్తరణ లో చోటు కల్పించాలనే ఆలోచనలో మోడీ ఉన్నట్లు సమాచారం. కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం గబ్బర్ సింగ్ 2 , వెంకటేష్ తో కలిసి నటిస్తున్న మరో చిత్రం ‘గోపాల గోపాల’ షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. మరి పవన్ మోడీ మంత్రి వర్గంలో చేరుతారో లేదో వేచిచూడాలి.

Friday 6 June 2014

మల్టీస్టారర్ మూవీ, గబ్బర్ సింగ్2 కి డేట్స్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ మూవీలకి సంబంధించిన షూటింగ్ ని స్పీడ్ చేస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న మల్టీస్టారర్ మూవీని త్వరగా పూర్తిచేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అందుకే గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనే దాని కంటే ముందుగా వెంకటేష్ తో నటించబోతున్న మల్టీస్టారర్ మూవీను ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఎప్పుడు పూర్తి చేయాలి? అనే విషయాలపై పవన్ పిచ్ఛ క్లారిగా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జూన్ 9న మల్టీస్టారర్ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కి డేట్స్ ఇచ్చాడు. జూన్ 9న పవన్ నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. తరువాత మరో పది రోజుల వరకు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. దీంతో ఈ మూవీకి సంబంధించి పవన్ సీన్స్ లో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తవుతుంది. మరో వారం రోజుల తరువాత పవన్ పై చిత్రీకరించాల్సిన రెండు, మూడు సీన్స్ కోసం పవన్ మరో రెండు రోజుల కాల్షీట్స్ ఇచ్చాడు. దీంతో మల్టీ స్టారర్ చిత్రంలో పవన్ కి సంబంధించిన షూటింగ్ పూర్తవుతుంది. ఆ తర్వాత పవన్ నటించబోతున్న గబ్బర్ సింగ్2 మూవీ కి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అన్నదానిపై, నిర్ణయించుకొని చిత్ర యూనిట్ కి చెబుతాడు. గబ్బర్ సింగ్ 2 మూవీకి దాదాపు 40 రోజుల కాల్షీట్స్ ని ఇచ్చినట్టుగా చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం. మొత్తంగా పవన్ కళ్యాణ్ మరో రెండు నెలల్లో తన ముందు ఉన్న రెండు చిత్రాలను పూర్తి చేసి, పుల్ టైం రాజకీయాల్లోకి దిగాలని ఆలోచిస్తున్నాడంట.